Pages

Tuesday, November 30, 2010

పుట్టినరోజు - కారంశంకర్

కాలాన్ని అలంకరించుకున్న
కాలెండర్లు
కాలం చెల్లగానే
చెత్త బుట్టలోపడతాయి
మనిషి అంతే
కాలం వెంట పరుగులెత్తి ఏదో ఒక రోజు
కాలగర్భం లో నే కలసి పోతాడు
అందమైన అనుభూతుల క్షణాల ముత్యాలని
కాలం గిన్నె లోంచి ఏరుకుంటాడు
గమ్యం గమనం తెలియక పోయినా
కాలం బరువును మైలుకో బండరాయి చొప్పున
తలపై మోస్తూనే ఉంటాడు
అతని ఆలోచనలన్నీ మురికి గుంటల్లో
అభ్యంగన స్నానాలు చేస్తాయి
పాపపు కూపంలో తల మునకలై
పాపులారిటికోసం తపనపడుతాడు
స్వార్థ చింతన చిగురు తొడిగి స్వాభి మానాన్ని
వేలం వేసుకొని విలాస జీవితానికి ద్వారం తెరుస్తాడు
నిరంతర ప్రయాణంలో ఒక మైలురాయిని దాటి
మలిమైలు లోనికి అడుగేస్తాడు
ఎవరు గమనించరుగాని
కాలం కత్తులతో ఆయుష్షుని రోజు రోజుకి కోసేస్తుంది

(ఇంకా వుంది )