Pages

Thursday, August 16, 2012

అమ్మ ఒక మహా కావ్యం - కారం శంకర్

అమ్మ అనగానే అమృతం తాగినట్టుంటుంది!
కలుషిత సమాజంలో కల్మషం లేనిది అమ్మ ప్రేమే కదా!!
అమ్మ చుట్టు ఆలోచన లు పరిభ్రమిస్తున్న  ప్పుడల్లా 
నేను పసివన్నై పోతాను !!
నేనిప్పటికీ అమ్మ పాడిన జోల పాటల్లో ఉయలూగుతుంటాను
అప్పట్లో అమ్మ పాల కమ్మదనాన్ని మగత నిద్ర లొనూ
చప్పరించేవాన్ని!
ఎప్పటికీ అమ్మ గర్భం ఓ వెచ్చని మందిరమే కదా!
నిష్కల్మష నిలయమే సదా!!

అమ్మా! నీ గుండెలపై చిట్టి పొట్టి కాళ్ళతో  తన్నినప్పుడు
ముగ్దు రాలివై  నా కాళ్ళని కుడా ముద్దాడే దానివి! 
నన్ను చూసి మురిసిపోయి ముచ్చట్లాడే దానివి గుర్తుందా ...?
నీ నోట్లో వేలు పెట్టి నే నాడుకున్నప్పుడు!
కొసపంటితో నా చేతి వేళ్ళను మృదువుగా
కొరికి గమ్మతులాడే దానివి!
అమ్మా!  నువ్వు అమ్మవి మాత్రమే కావు
నా ప్రాణ స్నేహితురాలివి !!
జ్యరమొచ్చి అల్లాడినప్పుడు
నన్ను నీ గుండెలకు హత్తుకుంటే చాలు !
ఏ మందులు అక్కర్లేకుండా పోయేవి !!
ఇప్పటికీ నిన్ను తలచుకుంటే చాలు!
ఎంతో ఉపశమనం పొందుతాను!!
అమ్మా నీ కళ్ళతోనే నా హృదయాన్ని ఎక్సరే తీసేదానివి
అంతేనా ...
నీ తల వెంట్రుకలతో దృష్టి తీసేదానివి !
నువ్విప్పటికి నా మానసిక గాయాల్ని
స్వస్తత పరిచే సై క్రియా టిస్ట్ వి  !
ఎన్నటికి చెరగని నా స్మృతి పతానివి
నిన్ను తలచుకుంటే చాలు!
ఏ గాయమైనా మాయమవ్వల్స్లిందే!!
అమ్మా  నువ్వో అద్బుత వాక్యనివి
మహా కావ్యానివి !!

1 comment:

  1. అమ్మ అనగానే అమృతం తాగినట్టుంటుంది!
    కలుషిత సమాజంలో కల్మషం లేనిది అమ్మ ప్రేమే కదా!!
    అమ్మ చుట్టు ఆలోచన లు పరిభ్రమిస్తున్న ప్పుడల్లా
    నేను పసివన్నై పోతాను !!
    నేనిప్పటికీ అమ్మ పాడిన జోల పాటల్లో ఉయలూగుతుంటాను
    అప్పట్లో అమ్మ పాల కమ్మదనాన్ని మగత నిద్ర లొనూ
    చప్పరించేవాన్ని!
    ఎప్పటికీ అమ్మ గర్భం ఓ వెచ్చని మందిరమే కదా!
    నిష్కల్మష నిలయమే సదా!! adabutam gaa chepparu sir chaalaa chaalaa bhavundi.....

    ReplyDelete