Pages

Sunday, August 26, 2012

ఒక సందర్భం

స్పృహను కోల్పోయి జీవిస్తున్న మనిషిపూర్తి స్పృహ లోకి ఎన్నడు రాలేడు
స్పృహలోకి రావడమే అతని అంతిమ లక్ష్యం

ఇది స్పృహ కోల్పోయిన సంధర్భం
అచేతనత్వపు దశ తర్వాత చేతనత్వం
నిస్పృహ లోంచి వడగట్టిన చలనధారాను
మస్తిష్కం లోకి వొంచుకోవాలి
మనమేంటో నిరుఉపించు కోవాలి

స్పృహ తర్వాత స్పృహే
స్పృహలో వుండడం
స్పృహ కలిగించడం
తనను తానూ స్పృహ లోకి రావడం కోసమే ఈ తపన
అపరిపక్వ భావాల అంతరంగం స్పృహలో వుండదు
చీకటి సముద్రపు ఆత్మశోధన లో
ఒక బీజం మొలకెత్తింది .

స్పృహ లేని సమాజం మధ్య
స్పృహ తో జీవించడమే కష్టం
స్పృహ తో వున్నవాన్ని స్పృహ కోల్పోయే టట్టు
చేయడమే జన తత్త్వం
అయితేనేం ?
 బోధి   వృక్షం అక్షర ఫలాల్ని పంచుతోంది

ఏమిటీ ఈ వెలుతురు కాంతి!
ఇంతకు ముందెప్పుడూ చూడలేదే !
అక్షరం ప్రకాశించింది
 అక్షర కాంతి  ముందు సూర్యబింబం చిన్నబోయింది
ఈ అక్షర  కాంతి లోనే మనిషి నిరంతర పయనం .

No comments:

Post a Comment