Pages

Friday, August 24, 2012

ఒక నిజం-ఒక అబద్దం

నేను మాట్లాడు తున్నది నిజం కాదునువ్వు మాట్లాడేది నిజం కాదు
వాళ్ళు మాట్లాడేది నిజం కాదు
నిజమన్నదే ది నిజం కాదు
ఏది నిజమో అదే నిజం
అబద్దమన్నదే ది అబద్దం కాదు
ఏది అబద్దమో అదే అబద్దం
దేన్నైనా నిరూపించడం ఎవరి తరం కాదు!
దేనికి కొలమానం వుండదు
నిరూపిస్తానన డం  ఒట్టి భ్రమ !
ఎవడో నిజాయితీ పరుడి నని చెప్పుకుంటాడు 
వినేవాడు అవినీతి పరుడైనప్పుడు.
సత్య హరిచంద్రుడు అసత్యం పలకలేదంటే
నమ్ముతారా ? ...నిజం చెప్పండి... !
కొన్ని నిజాలు చెప్పటానికి కూడా అబద్దమే ఆడాలి
కొన్ని అబద్దాలు చెప్పటానికి కూడా నిజాల్ని చెప్పాలి
ఎవడో ఒకడు మహాత్ముడంటే నమ్ముతారా ?
పాపానికి ఎన్నో రూపాలు
జనం కోసం ప్రాణాలని ఇస్తానన్నవాళ్ళని
మీరు నమ్ముతున్నారా ?
తనని తానూ సంస్కరించు కోలేని వాడే
సంఘ సంస్కర్త నని చెప్పుకుంటాడు
అసలైన ముర్ఖుడే మేధావినని ప్రకటించుకుంటాడు
నిజానికి మూర్ఖుడి ననుకునేవాడు
ఎన్నటికీ మూర్ఖుడు కాడు
ఏది నిజం కాదు మరేది మరేది అబద్దం కాదు
ఏది అసత్యమో అదే అసత్యం
ఏది సత్యమో  అదే నిజం






















No comments:

Post a Comment